నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలున్న ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలున్నాయంటూ తమిళనాడులోని నేలపట్టయ్ లో ఆటో డ్రైవర్ ఉమర్ షరీఫ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆటో డ్రైవర్ ఉమర్ షరీఫ్ ఇంట్లో ఉదయం 4 గంటల నుంచే ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఉమర్ షరీఫ్ ఇప్పటికీ నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలు నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎన్ఐఏ షరీఫ్ ఇంట్లో సోదాలు చేసి, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. అతడ్ని అదుపులోకి తీసుకొని, విచారణ నిమిత్తం చెన్నై తరలించారు. ఇటీవలె పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ‌తో పాటు దాని అనుబంధ సంస్థలైన CFI, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ గెజిట్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

Related Posts

Latest News Updates