కోయంబత్తూరు కారు పేల్లుళ్ల కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. కోయంబత్తూరుతో పాటు మరో 40 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. పలు కీలక డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది. చెన్నైలోని పుదుపేట్, మన్నాడి, జమాలియా, పెరంబూర్,కోయంబత్తూర్‌లోని కొట్టైమేడు, ఉక్కడం, పొన్‌విజా నగర్,రథినపురి సహా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
గత నెల 23వతేదీన జరిగిన కారు పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తు సాగిస్తోంది. అక్టోబర్ 23న తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని కోయంబత్తూరులో మారుతీ 800 కారులో ఎల్‌పీజీ సిలిండర్ పేలింది. కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం సమీపంలో సంభవించిన పేలుడులో జమేజా ముబిన్ అనే 25 ఏళ్ల వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.












