ఈగలపెంట, శ్రీశైలం మధ్య 400 కోట్ల అంచనాతో రోప్ వే ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 26 చోట్ల రోప్ వే ఏర్పాటుకు నిధులను ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ఏపీ ప్రతిపాదనలకు కూడా కేంద్రం ఓకే చెప్పిందని ఏపీ పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు. శ్రీశైలం దేవస్థానానికి భక్తులు, పర్యాటకులు రోజూ చాలా మంది వస్తుంటారని, ఈ రోప్ వే వారికి ఎంతో ఉపయోడపడుతుందని రజత్ భార్గవ కేంద్రానికి తెలిపారు.












