మిస్టరీగా వాణి జయరాం మరణం… ఎవరైనా హత్య చేశారా?

ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అపార్ట్‌మెంట్‌లో విగత జీవిగా ఆమె పడి ఉన్న తీరు, ఆమె ముఖంపై కనిపిస్తున్న గాయాలు కలకలం రేపుతున్నాయి. ఆమెది సహజం మరణం కాదా? హత్యనా? అని పలు అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు కూడా నమోదు చేసుకున్నారు. ఆ దిశగానే విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.

 

వాణి జయరాం ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి ప్రకారం… ఆమె చనిపోయిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలిపింది. శనివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే పనిచేసేందుకు వచ్చానని, తలుపులు మూసి వుండటంతో కాలింగ్ బెల్ కొట్టానని తెలిపింది. అయినా.. తలుపులు తీయకపోవడంతో… తన భర్త ఫోన్ లోంచి వాణీకి ఫోన్ చేసింది.అయినా.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు.దీంతో పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టారు. పోలీసులు డోర్‌ను బద్ధలు కొట్టి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో నట్టింట్లో ముఖంపై తీవ్ర గాయాలతో విగత జీవిగా వాణీజయరాం పడి ఉన్నారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాణీ జయరాం భర్త జయరాం 2018లో చనిపోవడం, వారికి పిల్లలు కూడా లేకపోవడంతో ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. రోజూ వచ్చే పని మనిషి సాయంగా ఉండేది.

Related Posts

Latest News Updates