అమెరికా హెచ్‌1-బీ వీసా లాటరీ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మోస, దుర్వినియోగ పద్ధతులను తొలగించడం ద్వారా హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆధునీకరించినట్టు ఒక యూఎస్‌ ఫెడరల్‌ ఏజెన్సీ వెల్లడించింది. కొన్ని కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల వీసాల కోసం కోసం కృత్రిమంగా కంప్యూటరైజ్డ్‌ డ్రాయింగ్‌ లాటరీ దరఖాస్తులను చాలాసార్లు సమర్పిస్తున్నాయని, ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఏజెన్సీ తెలిపింది. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో హెచ్‌-1బీ క్యాప్‌ సీజన్లలో మోసపూరిత పిటిషన్లను గుర్తించి తొలగించినట్టు తెలిపింది. ఈ మోసాలపై క్రిమినల్‌ నేరాభియోగాల నమోదుకు సిఫారసు చేసినట్టు చెప్పింది.