నేపాల్ చరిత్రకారుడు సత్యమోహన్ జోషి ఇకలేరు

నేపాల్ చరిత్రకాడురు, సాహిత్యవేత్త సత్యమోహన్ జోషి ఇకలేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోషి.. ఖాట్మండులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు జోషిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. కానీ డెంగీ ఫీవర్ రావడంతో ఇటీవల మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు.వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సత్యమోహన్ జోషికి గుండె సమస్య, డెంగీ ఫీవర్తోపాటు న్యుమోనియా కూడా ఉన్నట్లు తేల్చారు. సంబంధిత చికిత్స కొనసాగుతుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు.

సత్యమోహన్ జోషి 1919లో లలిత్పూర్లోని పటాన్లో జన్మించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే గొప్ప చరిత్రకారుడిగా, సాహిత్యకారుడిగా పేరు సంపాదించారు. ఆయన నేపాల్ చరిత్ర, సాహిత్యం, సంస్కృతికి సంబంధించి 60కి పైగా పుస్తకాలు రాశారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నేపాల్ ప్రభుత్వం ఆయనను పలు పురస్కారాలతో సత్కరించింది. . కాగా, జోషి మృతికి నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది. జోషి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.

Related Posts

Latest News Updates