రివ్యూ: ‘నేను మీకు బాగా కావలసినవాడిని’ కానీ ప్రేక్షకుడు అనుకోలేదు

ప్రపంచతెలుగు.కామ్  రేటింగ్ 2.5/5

నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్,
నటి నటులు: కిరణ్ అబ్బవరం,సంజనా ఆనంద్,సిద్ధార్థ్ మీనన్,ఎస్.వి.కృష్ణారెడ్డి,బాబా భాస్కర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంగీత దర్శకుడు: మణి శర్మ
సమర్పణ: కీ శే. కోడి రామకృష్ణ
నిర్మాత: కోడి దివ్య దీప్తి
దర్శకుడు: శ్రీధర్ గాదె
విడుదల తేదీ:16.09.2022

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ‘SR కళ్యాణ మండపం’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. యూత్‌లో కాస్త క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా ఈ రోజు రిలీజైంది. మరి ఆ సినిమా ఎలా ఉందనేది సమీక్షలో తెలుసుకుందాం…

కథ :
వివేక్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) క్యాబ్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుంటాడు. ఓసారి సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌నిచేసే అమ్మాయి తేజు (సంజ‌న ఆనంద్‌)ని డ్రాప్ చేయాల్సి వ‌స్తుంది. ప‌బ్‌కి వెళ్లిన ఆమె బాగా తాగేసి ఉంటుంది. అక్కడున్న సెక్యూరిటీ సాయంతో తేజుని డ్రాప్ చేయ‌టానికి వివేక్ బ‌య‌లుదేరుతాడు. దారిలో ఆమెను కొంద‌రు కిడ్నాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే కాపాడుతాడు. వివేక్‌కి అస‌లు ఓ అమ్మాయి అంత‌లా ఎందుకు తాగుతుందో అర్థం కాదు. దాంతో ఆమెనే అడుగుతాడు. ఆమె త‌న గ‌తం చెబుతుంది. ఆమె ఓ అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వ‌చ్చేస్తుంది. కానీ ఆ అబ్బాయేమో ఆమెకు అనుకోని షాక్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో మ‌గ‌వాళ్లంటేనే తేజుకి అస‌హ్యం వ‌చ్చేస్తుంది. ఇంటికి వెళ్లే ధైర్యం లేక హైద‌రాబాద్‌లోనే సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఆమె వివేక్ గురించి అడిగిన‌ప్పుడు అత‌ను కూడా త‌న ప్రేమ క‌థ‌ను చెబుతాడు. చివ‌ర‌కు తేజుకి న‌చ్చ‌చెప్పి వైజాగ్‌లోని ఆమె ఇంట్లో దిగ‌బెడ‌తాడు. అస‌లు క‌థ‌లో ట్విస్ట్ అక్క‌డే ఉంటుంది. అస‌లు వివేక్ ఎవ‌రు? అత‌నికి ప‌వ‌న్‌కి ఉన్న సంబంధం ఏంటి? తేజుని ఆమె ప్రేమించివాడు ఎందుకు మోసం చేస్తాడు? అనేదే క‌థ‌లోని ప్ర‌ధానాంశాలు. మిగతా కథ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు:
కిర‌ణ్ అబ్బ‌వ‌రం మ‌న ప‌క్కింటి కుర్రాడిలాంటి పాత్ర‌లో న‌టించి మ‌రోసారి మెప్పించాడు. త‌నే స్క్రీన్ ప్లే.. మాట‌లు రాసుకున్నాడు. అలాగే సినిమాలో త‌న పాత్ర‌కు కావాల్సిన హీరోయిజం ఎలివేష‌న్ సీన్స్‌, ఫైట్స్ కూడా ఇన్‌క్లూడ్ చేసుకున్నాడు. త‌న పాత్ర ప‌రంగా త‌న న‌ట‌న ఓకే. ఇక హీరోయిన్ సంజ‌నా ఆనంద్ పాత్ర చుట్టూనే సినిమా అంతా ర‌న్ అవుతుంది. ఆమె న‌ట‌న ప‌రంగా ఓకే అనించిందే త‌ప్ప‌.. ఆ పాత్ర‌లోని ఎమోష‌న్స్‌ను ఇంకా బాగా చేసుండ‌వ‌చ్చు అనే భావ‌న క‌లిగింది. ఇక బాబా భాస్క‌ర్ పాత్ర‌లో కాస్తో కూస్తో కామెడీ క‌నిపించింది. అది త‌ప్ప సినిమాలో ఎంట‌ర్‌టైనింగ్ పార్ట్ వెతికినా క‌న‌ప‌డ‌దు. సిద్ధార్థ్ మీన‌న్ చుట్టూనే ఫ‌స్టాఫ్ అంతా న‌డుస్తుంది. నిజానికి ఫ‌స్టాఫ్‌లో అత‌నే హీరో అనిపిస్తాడు. ఇక సినిమాలోని ఇత‌ర తారాగ‌ణంగా న‌టించిన ఎస్‌.వి.కృష్ణారెడ్డి , స‌మీర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదె. ఇంత‌కు ముందు కిరణ్ అబ్బ‌వ‌రంతో S. R.క‌ళ్యాణ మండపం వంటి సినిమా చేసి క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టాడు. ఆ సినిమాలో ఫాలో అయిన‌ట్లే పాట‌ల్లో ఇత‌ర హీరోల‌ను ఇమిటేట్ చేస్తూ హీరోతో స్టెప్పులేయించాడో. మాస్ మ‌సాలా సాంగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడో అదే పంథాను ఇక్క‌డ కూడా ఫాలో అయ్యారు. ఫ్యామిలీ, ల‌వ్ అనే పాయింట్స్‌తో సినిమా అన్న‌ప్పుడు ఎమోష‌న్స్ అనేవి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాలి. అయితే ఈ సినిమా ఎమోష‌న్స్ ప‌రంగా మెప్పించ‌లేక‌పోయింది. ద‌ర్శ‌కుడు సినిమాను అలా తెర‌కెక్కించ‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుడుకి క‌నెక్ట్ కావాల్సిన పాయింట్ హ‌త్తుకోదు. మ‌ణిశ‌ర్మ సంగీతంలోని పాట‌లు కానీ, నేప‌థ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రాజ్‌.కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది.సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ పెద్ద అమ్మాయి కోడి దివ్య దీప్తి సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ:
‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ హీరోయిన్‌ ప్రేమ‌లో మోస‌పోతుంది. దాంతో అబ్బాయిలంటేనే ద్వేషం పెంచుకుంటుంది. ఫ్ర‌స్టేష‌న్‌తో ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఓ క్యాబ్ డ్రైవ‌ర్ అయిన హీరో పరిచ‌యం అవుతాడు. ఆమె మ‌న‌సు మారుస్తాడు. కానీ హీరోకి, హీరోయిన్‌కి ఓ రిలేష‌న్ ఉంటుంది. అదేంట‌నేదే క‌థ‌. దాని చుట్టూనే క‌థంతా న‌డుస్తుంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ అండ్ ఫ్యూ లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ, సింపుల్ స్టోరీ, స్లో నేరేషన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ అలాగే ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 

Related Posts

Latest News Updates