ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న అన్ని మదర్సాలపై వివరణాత్మక విచారణ జరపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లేఖలు రాసింది. అలాగే ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న మదర్సాలలో ప్రవేశం పొందుతున్న ముస్లిమేతర పిల్లల విషయంలోనూ లోతుగా విచారణ జరిపి, వారి రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. ఈ రికార్డుల ఆధారంగా ముస్లిమేతర పిల్లలందర్నీ సాధారణ పాఠశాలలో చేర్పించాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న మదర్సాలలో ముస్లిమేతర పిల్లలు కూడా చదువుకుంటున్నారని, స్కాలర్ షిప్పులను కూడా తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు తమకు అందుతున్నాయని పేర్కొంది.












