నందమూరి నాయకుడు చేస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’ . బాలయ్య నటిస్తోన్న NBK 107వ సినిమా ఇది. దీని తర్వాత ఆయన హీరోగా నటించబోయే NBK 108 సినిమా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తదుపరి చిత్రంగా NBK 109 కూడా బాలకృష్ణ సిద్ధం చేసుకుంటున్నారట. అందుకోసం.. కథలను విన్నారట. రీసెంట్‌గా ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయటానికి ఆయన..నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ వైపు వరుస సినిమాలు చేస్తున్నారు. మరో వైపు అన్‌స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయటానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. NBK 109గా బాలకృష్ణ చేయబోయే సినిమా దర్శకుడెవరో కాదు.. వెంకట్ మహ . ఇంతకు ముందు కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వరాయ ఉగ్ర రూపస్య సినిమాలను ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించారు. ఇప్పుడు బాలకృష్ణతో సినిమాను చేయబోతున్నారు. రొటీన్‌కు భిన్నమైన సినమాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న వెంకట్ మహ.. నందమూరి హీరోతోనూ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేయబోతున్నట్లు టాక్. రీసెంట్‌గా బాలకృష్ణను వెంకట్ మహ కలిసి NBK 109కి సంబంధించిన సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో లైన్ చెప్పారట. అది బాలయ్యకు నచ్చటంతో ఆయన పూర్తి కథను సిద్ధం చేయమని అన్నారట. అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో NBK 109 సెట్స్ పైకి వెళుతుందట. ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు చేయడంలో ముందుండే బాలకృష్ణ మరోసారి ఎలా మెప్పిస్తారనే విషయం తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న వీర సింహా రెడ్డి వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుంది. దీనికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
