అన్ని విషయాలు తెలిసేదాకా ..కాస్త ఓపిక పట్టాలి : స్పందించిన విఘ్నేష్ శివన్

స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు పిల్లల్ని కనడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వీరు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కన్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, మన దేశంలో కమర్షియల్ సరోగసీ విధానాన్ని నిషేధించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సరోగసీ చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సరోగసీ ద్వారా పిల్లల్ని పొందొచ్చు. మరి ఈ నిబంధనలను అనుసరించే నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కవల పిల్లల్ని పొందారా అనేది ప్రశ్నార్థకం. దీనిపై తమిళనాడు వైద్యారోగ్య శాఖ కూడా వివరణ కోరనుంది. తమకు కవల పిల్లలు జన్మించారని నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన దగ్గర నుంచి ఈ విషయం చర్చనీయాంశమైంది. వీరు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని పొంది ఉంటారని అంతా భావించారు. అవునే సరోగసీ విధానం ద్వారానే పొందారు అని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. అయితే జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సరోగసీ చట్టం ప్రకారం సరోగసీ విధానంలో వేరే తల్లికి డబ్బులిచ్చి పిల్లల్ని పొందడం నేరం. సరోగసీ ద్వారా పిల్లల్ని పొందాలనుకునే తల్లిదండ్రులు తమకు జన్యుపరంగా సంబంధం ఉన్న వ్యక్తినో.. లేదంటే కుటుంబ సభ్యుల్లో ఒకరినో ఎంపిక చేసుకోవాలి. వారితోనే సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలి. అయితే, ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందే నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ వెళ్లారా అనేది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ డిసెంబర్‌ కంటే ముందే వీరు సరోగసీకి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఎలాంటి చిక్కూ లేదు. అలా కాని పక్షంలో వీరికి ఇబ్బందులు తప్పవు. ఇదే విషయంపై తమిళనాడు వైద్యారోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ కూడా స్పందించారు. సరోగసీపై నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులను వివరణ కోరతామని స్పష్టం చేశారు. దీనిపై మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ వివాదంపై నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, విఘ్నేష్ మాత్రం సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా స్పందించినట్లు కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆయన చేసిన పోస్టులు ఈ విషయానికి సంబంధించినవే అని అనుమానం వ్యక్తమవుతోంది. ‘‘సరైన సమయంలో అన్ని విషయాలు మీ దగ్గరికి వస్తాయి. ఓపికగా ఉండాలి. కృతజ్ఞతతో ఉండాలి’’ అని విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. అంటే, సరోగసీ గురించి అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయని విఘ్నేష్ ఇన్‌డైరెక్ట్‌గా అన్నారా? లేక ఆయన సాధారణంగా అలా పెట్టారా? ప్రస్తుతం తమిళ నెటిజన్ల ప్రశ్నలు ఇవే. సరోగసీ గురించే విఘ్నేష్ అలా స్పందించారని చాలా మంది వాదన. ఇదిలా ఉంటే, నయన్-విఘ్నేష్ దంపతులకు కవలలు పుట్టిన తరవాత వారికి చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. వీరిలో హీరో కార్తి కూడా ఉన్నారు. దీంతో కార్తీకి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విఘ్నేష్ థాంక్యూ చెప్పారు. కార్తీ పంపిన బొకే, విషెస్ నోట్‌ను ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విఘ్నేష్ షేర్ చేశారు. ఆ విషెస్ నోట్‌పై.. ‘తల్లిదండ్రుల ప్రపంచంలోకి మీకు స్వాగతం. మీ నలుగురికి ఆ దేవుడు దీవెనలు ఉండాలి’ అని కార్తి ఇంగ్లిష్‌లో రాశారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్