హీరోల మధ్య ఉన్నంత పోటీ సాధారణంగా హీరోయిన్ల మధ్య ఉండదు. అయితే 2020లో నయనతార హీరోయిన్ గా చేసిన మూకుతి అమ్మన్ ను తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. కోవిడ్ కారణంగా ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. డిజిటల్ రిలీజ్ అయినా సరే సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. దీనికి సీక్వెల్ తీయాలని అప్పట్నుంచే నిర్మాణ సంస్థ, డైరెక్టర్ ఆర్జే బాలాజీ ట్రై చేశారు కానీ కుదరలేదు. ఇప్పుడు అమ్మోరు తల్లి2ని అదే బ్యానర్ లో నయనతారతో తీసేందుకు రెడీ అయ్యారు. కానీ డైరెక్టర్ మారాడు. ఎవరనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే మరోవైపు ఆర్జే బాలాజీ మాసాని అమ్మన్ అనే టైటిల్ తో త్రిష లీడ్ రోల్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
రెండూ ఒకేసారి సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ప్రస్తుతం నయనతార, త్రిష ఇద్దరికీ భారీ క్రేజ్ ఉంది. ఇద్దరూ బాగానే డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వీరిద్దరూ ఒకేసారి అమ్మోరు తల్లులుగా కనిపించడం ఆడియన్స్ కు పండగే. కానీ ఒకేసారి వస్తుండటంతో వద్దన్నా పోలికలు వస్తాయి. ఎవరి సినిమా బాగుంది, ఎవరు బాగా చేశారనే విశ్లేషణలు జరుగుతాయి. మరి ఈ క్లాష్ లో ఎవరు గెలుస్తారో చూడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.