నవసాహితీ ఇంటర్నేషనల్ చరిత్రలో మరొక మైలు రాయి సాహితీ. రాజధాని వరంగల్ లో కాకతీయ విశ్వావిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ రమేష్ తాటికొండ చేతులమీదుగా నవసాహితీ కార్యాలయం ప్రారంభమైంది. మొదటి కార్యక్రమంలో సాహితీ గోష్టి లో కేంద్రాసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంప శయ్య నవీన్ సమాజం -సాహిత్యం, పొట్లపల్లి శ్రీనివాసరావు ఓరుగల్లు సాహితీ వైభవం గురించి ప్రసంగించారు.

నవసాహితీ తో కలిసి సాహితీ సదస్సులు వర్కుషాపులు నిర్వహించటానికి ఒక MOU కుదుర్చుకోవటానికి కాకతీయ విశ్వావిద్యాలయం విసి శ్రీ రమేష్ ఒక ప్రత్తిపాదన చేయటం దానిపై అంగీకారం కుదరటం చకచ కా జరిగిపోయాయి. నవసాహితీలో వరంగల్ సాహితీ మిత్రులు అనేకమంది చేరబోతున్నందుకు గర్వంగా సంతోషంగా ఉంది