జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు… పవన్ కల్యాణ్ ఉత్తర్వులు

కొణిదెల నాగబాబుకు ప్రమోషన్ లభించింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా వున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు విదేశాలలో వున్న పార్టీ ప్రతినిధులను, అభిమానులను కూడా నాగబాబు సమన్వయ పరుస్తారు. అలాగే ఎన్ఆర్ఐ సేవలను పార్టీ సమర్థవంతంగా ఉపయోగపడేవిధంగా సేవలు అందిస్తారని పార్టీ తెలిపింది. ఇక… పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ నిర్వహణ బాధ్యతలను అజయ్ కుమార్ నిర్వహిస్తారు. ఇక… నాగబాబు, అజయ్ కి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

Related Posts

Latest News Updates