మంత్రి ఆర్కే రోజాతో సహా పలువురు మంత్రులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గేట్ గా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆర్కే రోజా ఈ మధ్యే పవన్ పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై తీవ్రంగా మండిపడ్డారు. ఓ వీడియో పోస్ట్ ను రిలీజ్ చేశారు. ”మంత్రి రోజాది నోరు కాదు.. మున్సిపాలిటీ చెత్త కుప్ప” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. టాప్ 20 ర్యాంకింగ్స్‌లో దేశంలో ఏపీ పర్యటక శాఖ 18వ స్థానంలో ఉందని, రోజా బాధ్యత మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పర్యాటక మంత్రి అంటే.. పర్యటించడం కాదని, పర్యటక శాఖని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని చురకలంటించారు. ఏపీలో పర్యాటక శాఖపైన చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు దుర్భరమయ్యాయని నాగబాబు మండిపడ్డారు.
రోజా @RojaSelvamaniRK
నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? pic.twitter.com/SFeIpZdBeL— Naga Babu Konidela (@NagaBabuOffl) January 6, 2023