పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ కల్కి 2898ఏడి. ఈ సినిమాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు ఎన్నో అంశాలను ముడిపెడుతూ ఆవిష్కరించే అద్భుతం గురించి టీజర్స్ ద్వారా చూపించి ఇప్పటికే అంచనాలను పెంచేశాడు.
రీసెంట్ గా అమితాబ్ క్యారెక్టర్ అయిన అశ్వద్ధామ పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఓ రేంజ్ లో ఆడియన్స్ లోకి వెళ్లింది. చెప్పడానికి తక్కువ నిడివే అయినా ఆ నిమిషంలోనే హైప్ ను నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ చేశాడు. వాస్తవానికి కల్కి ద్వారా నాగ్ అశ్విన్ చేస్తున్న సాహసం ఎంతో పెద్దది. ఇతిహాసాల మీద పెద్దగా గ్రిప్ లేని ఈ జెనరేషన్ కు వాటి గొప్పదనాన్ని చూపించేలా ఓ కాన్సెప్ట్ ను తీసుకుని దానికి మహాభారతాన్ని జోడించి థ్రిల్ చేయబోతున్నాడు.
వేల సంవత్సరాల వెనుక జరిగిన సంఘటనలకు, ఇప్పుడు మనం చూస్తున్న ప్రమాదాలకు ముడిపెట్టి ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ ద్వారా కల్కి ప్రయాణాన్ని ఉన్నతంగా చూపించబోతున్నాడు. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీపడని కారణంగానే పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ పడుతుంది. దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.