ఎలాన్ మస్క్ కు నాగ్ అశ్విన్ విజ్ఞప్తి.. మా బుజ్జిని నడిపేందుకు ప్రేమతో

కల్కి 2898 ఏడీ చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన బుజ్జి అనే వాహనాన్ని  డ్రైవ్‌ చేయాలంటూ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కోరారు.  ఎక్స్‌ వేదికగా ఆయన్ను ఆహ్వానించారు. ఆ వెహికల్‌ను పలు నగరాల్లో నడుపుతూ టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌ చేస్తోంది. చెన్నై వీధుల్లో బుజ్జి చేసిన ప్రయాణానికి సంబంధించిన విజువల్స్‌ ఒకరు పోస్ట్‌ చేయగా, దానిపై డైరెక్టర్‌ స్పందించారు. డియర్‌ ఎలాన్‌ మస్క్‌ సర్‌.. మా బుజ్జిని చూసేందుకు, నడిపేందుకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ వెహికల్‌. ఇండియాలోనే తయారైంది. బరువు 6 టన్నులు. మీ (టెస్లా) సైబర్‌ట్రక్‌, బుజ్జి కలిసి దూసుకెళ్తుంటే చూసేందుకు బాగుంటుంది అని పేర్కొన్నారు. నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ పై మస్క్‌ ఎలా స్పందిస్తారోనని నెటిజన్లు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Latest News Updates