మంచి నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలన్నదే నా ప్రగాఢ వాంఛ!-దర్శకనటుడు గూడ రామకృష్ణ

పారితోషికంతో పట్టింపు లేదు
విలువలతో రాజీ పడేది లేదు!!

ప్రతి నటుడిలో ఓ దర్శకుడు ఉండకపోవచ్చేమో కానీ… ప్రతి మంచి దర్శకుడిలో కచ్చితంగా ఒక గొప్ప నటుడు ఉంటాడు. దాసరి నారాయణరావు, కె.విశ్వనాధ్ వంటి మహా దర్శకులు మొదలుకుని… భాగ్యరాజా, విజయ్ సేతుపతి, ఎస్.జె.సూర్య… కాశి విశ్వనాధ్, దేవీప్రసాద్, అవసరాల శ్రీనివాస్, తరుణ్ భాస్కర్ వంటివారు అందుకు మంచి ఉదాహరణలు. ఈ జాబితాలో తన పేరు సగర్వంగా చేర్చుకోవడమే కాకుండా… నటుడిగా సెంచరీ సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు డైరెక్టర్ టర్నెడ్ డీసెంట్ యాక్టర్ “గూడ రామకృష్ణ”.

దర్శకరత్న దాసరి దగ్గర “మజ్ను” చిత్రంతో సహాయ దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన గూడ రామకృష్ణ- ఎత్తులు పల్లాలు చూస్తూనే.. అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అయ్యప్ప అనుగ్రహంతో “తారక ప్రభుని దీక్షామహిమలు” చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత “సన్నజాజి, పెళ్ళాం వచ్చింది, జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా” చిత్రాలు తెరకెక్కించారు. “జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా” చిత్రం ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2009లో ఎంపికపై… ఉత్తమ దర్శకుడిగా శ్రీమతి సరోజినీ నాయుడు స్మారక “నంది పురస్కారం” పొందడం రామకృష్ణ సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు!!

దాసరి అనుంగు శిష్యుడు కావడం వలన పత్రికారంగంతోనూ అనుబంధం కలిగిన గూడ రామకృష్ణకు… ఇటు రాజకీయాల్లోనూ తగిన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బి.జె.పి ప్రచారక్ కమిటీలో ఉన్న రామకృష్ణ… “కంచె” చిత్రంతో నటనకు శ్రీకారం చుట్టారు. తను నటించిన “సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, చలో, క్రాక్, సైరా, సాహో, గాడ్ ఫాదర్” తదితర భారీ చిత్రాలతో తనకంటూ చిన్న గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఇప్పటికి 70 పైచిలుకు చిత్రాలు చేసి ఉండడం గమనార్హం. “పుష్ప2, గేమ్ చేంజర్, రాజాసాబ్, తమ్ముడు, భైరవం” వంటి పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రామకృష్ణ… స్థిరాస్తి రంగానికి సంబంధించిన వ్యవహారాలు అత్యంత సమర్ధవంతంగా చక్కబెట్టడంలో దిట్ట కావడం విశేషం!!

ఒక దర్శకుడిగా నిర్మాతల కష్టాలు నాకు బాగా తెలుసు. అందుకే… పాత్ర నచ్చితే పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోను. అవసరమైతే… నా కాస్ట్యూమ్స్ నేనే కుట్టించుకుంటాను” అంటారు గూడ. ఇటీవల విడుదలైన మంచు లక్ష్మి – సంజీవ్ మేగోటిల “ఆదిపర్వం” నటుడిగా తనకు ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్న ఈ బహుముఖ ప్రతిభాశాలి… తన ఏకైక కుమార్తెను సివిల్స్ కు అటెంప్ట్ చేసే స్థాయిలో తీర్చిదిద్ది.. ఘనంగా పెళ్లి చేసి, తన బాధ్యతలు నెరవేర్చుకుని… ఇకపై నటనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని, దైవానుగ్రహంతో పలువురు దర్శకులు పిలిచి అవకాశాలిస్తున్నారని సంతోషంగా చెబుతున్నారు. నటుడిగా తీరుబడి ఉన్నప్పుడే… పాలిటిక్స్, రియల్ ఎస్టేట్ తప్ప… సినిమాలకే తన “ఫస్ట్ ప్రయారిటీ” అని చెబుతున్న గూడ రామకృష్ణను నేరుగా సంప్రదించాలనుకునేవారు 93913 27601 కి కాల్ చేయవచ్చు!!

Related Posts

Latest News Updates