ప్రేక్షకులకు నచ్చేవిధంగా సినిమాలు తీయడమే నా లక్ష్యం.. మాస్ డైరెక్టర్ వి. సముద్ర !!

ఆలోచనల అలలతోనే అనునిత్యం సాన్నిహిత్యం…

కథా, కథన మథనంతోనే సదా గడిపే సాంగత్యం…

ఘన విజయాల నిధులను నిక్షిప్తం చేసుకున్న ఔన్నత్యం..

వెరసి… తనే తరహా చిత్రాన్ని చేపట్టినా..

అందులో తనదైన ముద్రను స్పష్టంగా చూపించే సమర్ధుడు..

అపార అనుభవం – అమిత నైపుణ్యం లోలోతుల్లో నింపుకున్న సముద్రుడు…

ఆయనే మాస్ డైరెక్టర్ వి. సముద్ర.

“సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, చండీ, మహానంది, పంచాక్షరి”, వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వి. సముద్ర..

క్లాస్ చిత్రాలైనా, మాస్ చిత్రాలైన కుటుంబ సమేతంగా చూసే విధంగా సినిమాలను రూపొందించడంలో ఆయనకో ప్రత్యేకమైన శైలి వుంది. నేటి తరానికి అనుగుణంగా తనకు తాను అప్ డేట్ అవుతూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే సదుద్దేశంతో సినిమాలను రూపొందిస్తున్నారు మాస్ డైరెక్టర్ సముద్ర.. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ‘వరదరాజుగోవిందం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా వుండగా.. ఇండియా సిఇఓ, రామజన్మభూమి, కుంభ, దో కమినే, నెమలి, చిత్రాలను సముద్ర తెరకెక్కించబోతున్నారు.. డిసెంబర్ 9న సముద్ర పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు కె ఎస్ రవికుమార్ చౌదరి, శివనాగు, నగేష్ నారదాసి, అంజి శ్రీను, లక్కాకుల మల్లికార్జున, రాజేందర్ దర్శన్, దొరై రాజు, హీరో జై సిద్ధార్థ, నటులు దాసన్న, ఖదీర్, మ్యూజిక్ డైరెక్టర్ డా. రవిశంకర్, తదితరులు పాల్గొని.. గజమాల, పుష్పగుచ్చలతో సత్కరించి దర్శకులు సముద్ర కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం వీడియో బైట్ ద్వారా సీనియర్ హీరో సుమన్ సముద్ర కి బర్త్ డే విషెష్ తెలుపుతూ..” వరదరాజు గోవిందం సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాను.. సముద్ర గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా వుంది.. సెట్లో ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు.. ప్రతి సీన్ తనకి కావలిసిన విధంగా క్లారిటీగా తీసుకుంటారు.. ఎంతోమంది కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ.. మంచి సూపర్ హిట్ సినిమాలు చేయాలని.. కోరుకుంటూ.. మా సముద్రకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అన్నారు.

మాస్ డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ.. ” నా మీద అభిమానంతో వచ్చి నాకు పుట్టినరోజు విషెష్ తెలిపిన నా సహచర దర్శకులు అందరికీ నా స్పెషల్ థాంక్స్.. అలాగే నా మిత్రులు, మా కుటుంబ సభ్యుల సహకారంతో ఆరు చిత్రాలు తెరకెక్కించబోతున్నాను. ముఖ్యంగా నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు.. ఈ పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకమైనది.. ఎందుకంటే వరదరాజు గోవిందం సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. అలాగే రామజన్మభూమి, దొ కమీనే, ఇండియా సిఇఓ, కుంభ, నెమలి, చిత్రాలు అండర్ ప్రొడక్షన్ లో వున్నాయి.. వన్ బై వన్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు చేయడమే నా లక్ష్యం.. అన్నారు.

Related Posts

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట,14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంట్స్ #BB4 ‘అఖండ 2: తాండవం’ బ్రెత్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ ప్రారంభం- 25-09-25న దసరాకి థియేట్రికల్ రిలీజ్

Latest News Updates

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట,14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంట్స్ #BB4 ‘అఖండ 2: తాండవం’ బ్రెత్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ ప్రారంభం- 25-09-25న దసరాకి థియేట్రికల్ రిలీజ్