ఇండియాలో అతి పెద్దదైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించటంలో తన ప్రత్యేకతను జీ 5 నిరూపించుకుంటేనే ఉంది. అందులో భాగంగా డైరెక్ట్ డిజిటల్ ఫిల్మ్ ‘రౌతు కా రాజ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ థ్రిల్లింగ్ మిస్టరీ ఫిల్మ్‌ను ఆనంద్ సురాపూర్ దర్శకత్వంలో జీ స్టూడియోస్, ఫాట్ ఫిష్ రికార్డ్స్ నిర్మించాయి. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో సమర్ధవంతమైన పోలీస్ ఆఫీసర్ దీపక్ నేగి పాత్రలో నటించారు. ఉత్తరాఖండ్ లోని రౌతు కీ బేలి అనే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజేష్ కుమార్, అతుల్ తివారీ, నారాయణి శాస్త్రి కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది జీ5లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హడ్డీ తర్వాత జీ5, జీ స్టూడియోస్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘రౌతు కా రాజ్’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.