మునుగోడులో విజయం సాధించిన సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారితో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. కూసుకుంట్లతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, నల్లగొండ నేతలు కూడా వున్నారు. మునుగోడులో బంపర్ విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇక.. మునుగోడులో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు ప్రకటించారు. ఇక… ఎన్నికల సందర్భంగా మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కార్యాచరణ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.