మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నాటికి 11.20 శాతం పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు పోలింగ్ సరళిపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచే స్థానిక నేతలతో మాట్లాడారు.
ఇక… ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. నియోజకవర్గంలోని 2 చోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తగా… సిబ్బంది వెంటనే సరిచేశారని పేర్కొన్నారు. అయితే… చండూరులో కొంత మంది నేతలు ఓటర్లకు నగదు పంచేందుకు యత్నించారు. అప్పుడు పోలీసులను చూసి డబ్బును అక్కడే వదిలేసి, వెళ్లిపోగా… 2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇక.. మల్లప్పరాజు పల్లిలో 10 లక్షల నగదును పట్టుకున్నారు. నగదు తరలిస్తున్న కారును బీజేపీ నేతలు పట్టుకున్నారు.