తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో పాటు ఇతర పార్టీ నేతలు, రైతు సంఘాల నేతలను కూడా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి తమిళనాడు రాష్ట్రం నుం చిరుతైగళ్ పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు ద్రావిడ దేశం అధినేత కృష్ణారావు కూడా వచ్చారు. వీరిద్దరికీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి స్వాగతం పలికారు.