పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నేరానికి పాల్పడే కొంత మంది వ్యక్తులు చేసే పనుల వల్ల సంస్థను నిషేధించడం సరికాదన్నారు. అంత మాత్రాన తాను పీఎఫ్ఐకి ఏమాత్రం అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఒకరిని దోషిగా తేల్చడానికి ఓ సంస్థతో అనుబంధం వున్నంత మాత్రాన సరిపోదని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించిందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విధానాన్ని సమర్థిస్తూనే ఉన్నా.. కానీ.. పీఎఫ్ఐపై ఈ నిషేధానికి మద్దతు ఇవ్వలేమన్నారు. ఈరకమైన కఠినమైన నిషేధం ప్రమాదకరమని, ప్రతి ముస్లిం యువకుడు ఇప్పుడు యూఏపీఏ చట్టం కింద పీఎఫ్ఐ కరపత్రంతో అరెస్ట్ అవుతారంటూ ట్వీట్ చేశారు.