కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేీ అయ్యారు. తన పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి గురించే తాను మోదీని కలిశానని వివరించారు. అపాయింట్ మెంట్ అడగ్గానే ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు ప్రకటించారు. మోదీతో దాదాపు 25 నిమిషాల పాటు కోమటిరెడ్డి సమావేశమయ్యారు. మూసి ప్రక్షాళన, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల రోడ్ల విస్తరణ అంశాన్ని ప్రధానమంత్రికి వివరించారు. అలాగే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలని కోరినట్లు వెల్లడించారు. అయితే.. తమ మధ్య రాజకీయ అంశాలు మాత్రం చర్చకు రాలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్ లోని సబర్మతి నదిలా మూసీ రూపురేఖలు మార్చాలని విన్నవించానని అన్నారు. మూసీ నదిలో డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల లక్షల మంది అనారోగ్యం పాలువుతున్నారని వెంకట్ రెడ్డి ప్రధాని దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. తన విన్నపంపై స్పందించిన మోడీ మూసీ ప్రక్షాళనపై త్వరలోనే ఓ కమిటీ వేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.