సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం… సినిమా ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. విజయమాధవి, పూర్ణోదయా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలకు ఆస్థాన ఎడిటర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 87 సంవత్సరాలు. మంగళవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపుగా 300 పైగా సినిమా లకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు. శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నల, శృతిలయలు, ఆపద్బాంధవుడు, బొబ్బలిపులి, సర్దార్ పాపరాయుడు, శ్రీరామరాజ్యం లాంటి ఎన్నో చిత్రాలకు ఆయన ఎడిటర్గా పనిచేశారు. కళాతపస్వీ కె విశ్వనాథ్, బాపు, జంధ్యాల, దాసరి వంటి దిగ్గజ దర్శకులతో ఆయన పనిచేశారు. అలాగే దర్శక రత్న దాసరి నారాయణ రావు బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు లాంటి సినిమాకు కూడా పనిచేశారు.

Related Posts

Latest News Updates