తెలంగాణ రాష్ట్రంలో   టీఆర్ ఎస్ పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చిన ముగ్గురు నిందితుల‌కు హైకోర్టు ఆదేశాల మేర‌కు  ఏసీబీ కోర్టు జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించింది. రామచంద్రభారతి (సతీశ్​శర్మ), నందుకుమార్​, సింహయాజి అనే నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. దిల్ సుఖ్ నగర్ లోని మెజిస్ట్రేట్ నివాసంలో పోలీసులు నిందితుల‌ను హాజరు పరిచగా ఈ మేర‌కు వారికి న‌వంబ‌ర్ 11వ తేదీ దాకి రిమాండ్ విధించారు.  నిందితులను రిమాండ్‌కు తరలించే క్రమంలో పోలీసులు వారికి చేవెళ్ల ఏరియా దవాఖానలో వైద్య పరీక్షలు జరిపారు.  ఆ తరువాత   రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ను  చంచల్‌గూడ జైలుకు తరలించారు.