ఏపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు.. ఎందుకంటే.?

 ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పార్టీ నేతలు తమ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన పేరు వాడుకుంటున్న వారికి టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహన్ బాబు వార్నింగ్ ఇస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా లేఖ విడుదల చేశారు. https://cinemaabazar.com/

ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా.. నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి , సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను’ అంటూ మోహన్ బాబు లేఖ విడుదలు చేశారు. కాగా ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. https://cinemaabazar.com/

Related Posts

Latest News Updates