మహారాష్ట్రలోని నాగ్ పూర్, ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ మధ్య ఆరవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అనంతరం వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రీడమ్ పార్క్ స్టేషన్ లో టికెట్ కొనుక్కొని, కొంతమంది పిల్లలతో కలిసి ఖాప్రీ వరకు మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు.












