ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్థాయి అంతర్జాతీయంగా మరింత బలపడింది. అగ్ర దేశాధినేతలను తలదన్ని ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో మరోసారి నిలిచారు. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. తర్వాత 56 శాతం రేటింగ్ తో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (41 శాతం రేటింగ్- మూడో స్థానం), కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో (38 శాతం రేటింగ్- నాలుగు), బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (36 శాతం రేటింగ్- ఐదు ), జపాన్ ప్రధాని కిషిండా (23 శాతం రేటింగ్- ఆరు) నిలిచారు. 22 దేశాల అధినేతల రేటింగ్స్ తో ఈ సంస్థ జాబితాను విడుదల చేసింది. మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వే నివేదిక ఈ వివరాలను వెల్లడించిందని బీజేపీ తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలోనూ, గత ఏడాది నవంబరులోనూ విడుదలైన నివేదికలలో కూడా మోదీ అత్యంత ప్రజాదరణగల ప్రపంచ నేతల్లో అగ్రస్థానంలోనే ఉన్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో 75 శాతం అప్రూవల్ రేటింగ్‌తో మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు.












