రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తున్నది. ద్రవిడవాదాన్ని బలంగా విశ్వసించే తమిళనాడులో బీజేపీకి ఏమాత్రం పట్టులేదు. తమిళులు బీజేపీని ఉత్తర భారత పార్టీగా భావిస్తారు. తమ విశ్వాసాలకు, ప్రయోజనాలకు బీజేపీ వ్యతిరేకమనే భావన అక్కడి ప్రజల్లో ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ ముద్ర పోగొట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మోదీని అక్కడి నుంచి పోటీ చేయించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది. బీజేపీని విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే తమిళులు ఎంతవరకు బీజేపీని ఆదరిస్తారనేది చూడాలి.