అర్జున్ నిర్మించిన ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

హీరో అర్జున్ నిర్మించిన భారీ ఆంజనేయ దేవస్థానాన్ని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పూజలు కూడా చేశారు. ప్రముఖ దిన పత్రిక నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కవిత చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా అర్జున్ నిర్మించిన దేవాలయాన్ని సందర్శించారు.

అక్కడ పూజలు చేశారు. అర్జున్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. చెన్నైకి రావడం ఎల్లప్పుడు సంతోషంగా ఉంటుందని కవిత తెలిపారు. తమిళనాడు సాంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక, వారసత్వ సంపదను చూసి రాష్ట్ర ప్రజలందరు గర్వపడాలని పేర్కొన్నారు. ఆలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

Related Posts

Latest News Updates