తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాగిరెడ్డి పేట మండలంలో జరిగిన పార్టీ సమావేశానికి ఆమె హాజరయ్యారు. వీటన్నింటినీ చూసి టీఆర్ఎస్ నేతలు భయపడొద్దని, ఆగం కావొద్దని సూచించారు. తెలంగాణలో బీజేపీ రామ్ రామ్ జప్నా… పరాయి లీడర్ అప్నా అన్న పాలసీని అనుసరిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ అసలు కోర్టుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తాము విచారణకు హాజరు కావాలి గానీ… బీజేపీ వారు విచారణకు రారా? అని మండిపడ్డారు. బీజేపీ సభలో అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారో అర్థం కావడం లేదన్నారు.