ఏపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి (46) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. 2020 డిసెంబర్ లో వీరి తండ్రి చల్లా రామకృష్ణ రెడ్డి కరోనాతో కన్నుమూశారు. దీంతో భగీరథకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా న్యుమోనియాతో కన్నుమూశారు. రేపు ఆయన భౌతిక కాయాన్ని స్వస్థలానికి తరలించి, మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.












