ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కాకినాడకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కొద్ది రోజుల క్రితం ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయలేదని, అందుకే బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే… దీనిపై పోలీసులు సమాధానమిచ్చారు. నిర్ణీత సమయంలోనే తాము ఛార్జిషీట్ దాఖలు చేశామని, సాంకేతిక కారణాలతో తిప్పి పంపారని కోర్టు ముందు విన్నవించారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు… అనంతబాబు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Related Posts

Latest News Updates