బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరుచూ మరమ్మతులకు గురవుతోందని, వెంటనే మార్చాలంటూ లేఖలో డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలిపానని, అయినా… అదే వాహనాన్ని తనకు కేటాయిస్తూ వస్తున్నారని మండిపడ్డారు. తరుచూ మొరాయించడంతో ఎటూ వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు.
ఇటీవలే కొంత మంది ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ప్రభుత్వం ఇచ్చిందని, ఆ జాబితాలో తన పేరు లేదని అన్నారు. తీవ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని వుందని, ఈ విషయం పోలీసులకు కూడా తెలుసన్నారు. అయినా… తన భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. వెంటనే పాత వాహనాన్ని మార్చేసి, కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు కేటాయించాలని లేఖలో రాజాసింగ్ డిమాండ్ చేశారు.