గోషామహల్ ఎమ్మెల్య రాజాసింగ్ నేడు పీడీ యాక్ట్ సలహా మండలి ఎదుట హాజరయ్యారు. బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌజ్ లో పీడీయాక్ట్ సలహా మండలి సమావేశమైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ పక్షాన ఆయన భార్య, ఆయన తరపు న్యాయవాది హాజరై, వాదనలు వినిపించారు. మరోవైపు ఎమ్మెల్యేపై పీడీ యాక్టు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో పోలీసులు ఆధారాలతో సహా సలహా మండలి ముందు పెట్టారు. మరోవైపు జైలులో వున్న కారణంగా ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ సలహా మండలి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

 

కేసీఆర్ ప్రభుత్వం తన మీద రాజకీయ కక్షతోనే పీడీయాక్ట్ పెట్టిందని, తనపై అక్రమంగా కేసు నమోదు చేసిందని రాజాసింగ్ వాదించారు. అయితే… ఇరువురి వాదనలు పూర్తిగా విన్న సలహా మండలి.. తీర్పును రిజర్వ్ చేసింది. వచ్చే నెల 4 లేదా 5 తేదీల్లో తీర్పు వచ్చే ఛాన్స్ వుందని రాజాసింగ్ తరపు న్యాయవాది అన్నారు. మరోవైపు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే.. హైకోర్టును ఆశ్రయించాలన్న యోచనలో రాజాసింగ్ వున్నట్లు సమాచారం.