తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మారన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో గవర్నర్ ఆర్ఎన్ రవి ఉదయనిధితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయనిధికి క్రీడల శాఖను అప్పగిస్తూ స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సీఎం స్టాలిన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీఎంకే కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా నినాదాలు చేశారు. ఇప్పటికే సచివాలయంలో ఉదయనిధికి ఓ ప్రత్యేక ఛాంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి చపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.