గుజరాత్ లోని రెండు జిల్లాల్లో వుంటున్న 3 దేశాల మైనారిటీలకు భారత పౌరసత్వం

గుజరాత్ లోని రెండు జిల్లాల్లో వుండే ఆఫ్గన్, పాకిస్తాన్, బంగ్లాకి చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు,పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం లభించనుంది. సిటిజన్ షిప్ యాక్ట్ 1955 ప్రకారం కేంద్రం ఈ నిర్షయం తీసుకుంది. గుజరాత్ లోని ఆనంద్, మెహసానా జిల్లాల్లో వుండే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం ఇవ్వనున్నారు. రెండు జిల్లాలకు చెందిన పైన పేర్కొన్న వర్గీయులు ఆన్ లైన్ ద్వారా తమ అప్లికేషన్లను అప్లై చేయాలని, వాటిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఆన్ లైన్ తో పాటు ఓ రిజిస్టర్ ను కూడా అధికారుల వద్ద వుంటుందని అధికారులు తెలిపారు. అయితే… కలెక్టర్ విచారణ తర్వాత వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు. అంతేకాకుండా వారికి సర్టిఫికేట్ కూడా అందజేస్తారు.

Related Posts

Latest News Updates