బలగం’  కుటుంబం సమేతంగా చూడాల్సిన చిత్రం : మంత్రి తలసాని

తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటుంది. ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల‌ను సైతం సినిమా ఆక‌ట్టుకుంటోంది. మ‌నంద‌రి జీవితాల్లో జ‌రిగిన , మ‌నం చూసిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని మ‌నిషికి బందాలే గొప్ప బ‌లం.. బ‌ల‌గం అనే చాటి చెప్పేలా సినిమాను రూపొందించారు. ఈ సినిమాను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ సోమవారం ప్రత్యేకంగా వీక్షించారు. అనంత‌రం.. బ‌ల‌గం టీమ్‌ను అప్రిషియేట్ చేస్తూ మీడియాతో మాట్లాడుతూ …

‘‘సినిమాల్లో క‌మెడియ‌న్‌గా మెప్పించట‌మే కాకుండా ప‌లు టీవీ షోస్‌లో న‌టించి ఆక‌ట్టుకున్న వేణు ఎల్దండిగారు ‘బ‌ల‌గం’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. దిల్ రాజుగారు ఎప్పుడూ మంచి చిత్రాల‌ను అందించాల‌ని ఆలోచిస్తుంటారు. ఆయ‌న వార‌సులైన హ‌ర్షిత్‌, హ‌న్షిత‌లు ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించాల‌నే సంక‌ల్పంతో ‘బ‌ల‌గం’ అనే చిత్రాన్ని నిర్మించారు. గ్రామీణ వాతావరణంలో రియాలిటీగా తరతరాలుగా జరిగే ఓ పాయింట్‌ను తీసుకుని దాన్ని క‌థ‌గా మార్చారు. దాంట్లో ప్రియ‌ద‌ర్శిగారు, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌గారు ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల‌ను పోషించారు.

Related Posts

Latest News Updates