కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పునరుద్ఘాటించారు.  విద్యా రంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రవ్యాప్తంగా 400 కాలేజీలు ఉండేవని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఈ ఎనిమిదేండ్లలో 1150 గురుకులాలను కాలేజీలుగా మార్చామని పేర్కొన్నారు.

 

శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో రూ. కోటి 35 లక్షల నిధులతో నిర్మించిన అదనపు గదులను, వసతి గృహాన్ని మంత్రి సబిత ప్రారంభించారు. దీంతో పాటు విదేశాలలో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ. 20 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. గురుకుల్లాలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిపై ఏడాదికి లక్షా 25 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నామని మంత్రి సబిత తెలిపారు.