కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబీకులను పరామర్శించారు. కృష్ణంరాజు మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు కుటుంబీకులకు రాజ్ నాథ్ సింగ్ ధైర్యం చెప్పారు. కృష్ణంరాజుకు అందిన వైద్యం, ఆయన ఆరోగ్య పరిస్థితులు వీటన్నింటినీ ఎంపీ లక్ష్మణ్, కృష్ణంరాజు కుటుంబీకులు రాజ్ నాథ్ కు వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె. లక్ష్మణ్ తో కలిసి రాజ్ నాథ్ సింగ్ కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. అనంతరం ఓ గార్డెన్ లో జరిగే సంతాప సభలో రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.