జమ్మూ కశ్మీర్ లో 64 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు… ప్రకటించిన కేంద్రం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో పారిశ్రామిక రంగం ఎదుగుతోందని కేంద్రం పేర్కొంది. స్థానిక అధికార యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక పారిశ్రామిక విధానంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి జోన్ ల వారీగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్ కు 64 వేల కోట్ల ప్రతిపాదనలు రాగా… ఇప్పటి వరకూ 2,500 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. 2017-18 లో 840.55 కోట్ల పెట్టుబడులు రాగా… 2018-19 లో 590.97 కోట్లు, 2019-20 లో 296.64 కోట్లు, 2020-21 లో 412.74 కోట్లు, 2021-22 లో 376.21 కోట్లు వచ్చాయని తెలిపారు.

Related Posts

Latest News Updates