ఐటీ విచారణకు హాజరవ్వడంపై మంత్రి మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను ఐటీ విచారణకు హాజరవ్వడం లేదని కీలక ప్రకటన చేశారు. తన తరపున తన ఆడిటర్ హాజరవుతారని పేర్కొన్నారు. అయితే… తన కుటుంబీకులు మాత్రం విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు. సిటీలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వుందని, అందుకే తాను విచారణకు వెళ్లడం లేదన్నారు.

కొన్ని రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిపింది. రెండు రోజుల పాటు సోదాలు సాగాయి. భారీగా నగదుతో పాటు కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరవ్వాలని మంత్రి మల్లారెడ్డికి చెందిన 16 మంది కుటుంబీకులు, బంధువులకు ఐటీ నోటీసులిచ్చింది.