తమ డిమాండ్ల కోసం బాసర విద్యార్థులు చేసిన ఆందోళన పద్ధతి తనకు బాగా నచ్చిందని, అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలపడం చాలా గ్రేట్ అని అన్నారు. మంత్రి కేటీఆర్ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మరో 2 నెలల్లోనే బాసర క్యాంపస్ ను సందర్శిస్తానని ప్రకటించారు.
ఇక… హాస్టల్ లో మౌలిక సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. మెస్ సరిగా లేదన్న విషయాన్ని ఇప్పటికే తాము గుర్తించామని, ఇక నుంచి ప్రతి రోజూ మంచి ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హాస్టల్ లో వుండే కష్టాలు తనకు కూడా తెలుసని, సమస్యలను తెలుసుకునేందుకు కాస్త సమయం పడుతుందన్నారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కేటీఆర్ హామీ ఇచ్చారు.