ఏపీలో జరగనున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అభిలషించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. విశాఖ వేదికగా జరగబోయే ఇన్వెస్టర్ సమ్మిట్ జయవంతం కావాలన్నారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా వుండాలని అభిలషించారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పనులు పూర్తయ్యాయి. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వస్తున్న పారిశ్రామికవేత్తలతో విశాఖ ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది. మార్చి మూడు, నాలుగవ తేదీలలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించి భారీ పెట్టుబడులను లక్ష్యంగా చేసుకొని ప్రణాళిక బద్దంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కార్ ప్లాన్ చేసింది.

https://twitter.com/KTRBRS/status/1631138650124881920?s=20

రెండు రోజులు పాటు విశాఖ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో 24 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. 14 రంగాలలో పెట్టుబడులకు సంబంధించి అనేక ఎం ఓ యు లు జరుగుతాయని ఇప్పటికే ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్న వనరులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

 

నిన్న ఒక్క రోజు 4 వేల కు పైగా రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. మొత్తం 12 వేల మందికి పైగా తమ పేరును నమోదు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల అధిపతులు విశాఖకి రానున్నారు. ఇక… కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డి, పీయూష్ గోయలు, ఆర్కే సింగ్ రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో పాల్గొంటారు. వీరితో పాటు ముఖేశ్ అంబానీ, అదానీ, కుమార మంగళం బిర్లా, సంజీవ్ బజాజ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, గ్రంధి మల్లికార్జున రావు తదితరులు పాల్గొంటున్నారు.