తెలంగాణ ఆవిర్భావం తర్వాత అతి తక్కువ కాలంలోనే 24 గంటల పవర్ ఇచ్చే స్థాయికి వచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో రెప్పపాటు కూడా పవర్ కట్ లేదన్నారు. హైదరాబాద్ JNTUలో ఇన్నోవేషన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ పై అంతర్జాతీయ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వగ్రామానికి ఆమె రాష్ట్రపతి అభ్యర్థి అయ్యాక కరెంట్ వచ్చిందని కేటీఆర్ చెప్పారు. దేశంలోని అన్ని నదులు, నీటి వనరులతో 70 వేల టీఎంసీల నీరు దేశంలో ఉందని.. 40 నుంచి 50 టీఎంసీల నీరు అన్ని అవసరాలకు సరిపోతుందని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వెల్లడించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకురాలేదని సూటిగా ప్రశ్నించారు.

 

క్వాలిటీ అనగానే విదేశాలు గుర్తుకు వస్తాయని కేటీఆర్ అన్నారు. భారత్‌ అంటేనే శక్తివంతమైన దేశమని, 1986లో చైనా, భారత్‌ రెండు దేశాల జీడీపీ ఒకేరంగా ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు 5.7శాతం ఎక్కువ వృద్ధి రేటు సాధించిందన్నారు. చైనా అంత వృద్ధి రేటు అంత పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయని వివరించారు. సింగిల్ మైండ్ ఫోకస్ థింగ్స్, ప్రపంచ అతిపెద్ద ఫార్మా క్లస్టర్లతో ముందుకెళ్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. అద్భుతమైన క్వాలిటీ మన దగ్గర కూడా వుందని, అయితే… ఇక్కడ కుల, మతాలు చూస్తూ వెళ్తున్నామని పేర్కొన్నారు. వీటితో నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం తప్ప, వేరే ఆలోచనే లేదని కేటీఆర్ అన్నారు.