భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్యాగ‌ధ‌నుల‌ను స్మ‌రించుకుంటూ ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌కు పోరాటాలు కొత్త కాద‌న్నారు. 1948లో రాచరిక ప్రభువుపై, 1956లో ఆంధ్రాలో విలీనమైనప్పుడు, 1960 దశకంలో తెలంగాణ కోసం, 2001లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కోసం పోరాటం జరిగి లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తు చేశారు.

 

తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టడం హర్షణీయమ‌ని పేర్కొన్నారు.తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత సంక్షేమానికి రాష్ట్రం ట్రేడ్ మార్క్‌గా నిలిచింద‌న్నారు. జిల్లాలో 85 నుంచి 90 శాతం కుటుంబాల‌కు పెన్ష‌న్ అందుతుంద‌న్నారు. సిరిసిల్ల జిల్లాకు కొత్త‌గా 17 వేల పెన్ష‌న్‌లు మంజూరు చేసిన‌ట్లు మంత్రి గుర్తు చేశారు. కరెంట్, నీళ్ల‌ వ్యవస్థ కూడా మెరుగు పడింద‌న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నామ‌ని తెలిపారు