హైదరాబాద్ పర్యటనలో వున్న మైక్రోసాఫ్ట్ సీఈఓతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇద్దరు హైదరాబాదీలు కలిసిన శుభారంభం అంటూ మంత్రి కేటీఆర్ సత్య నాదెళ్లతో దిగిన ఫొటోను షేర్ చేశారు. తాము బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నామని ఓ స్మైల్ ఎమోజీని కేటీఆర్ షేర్ చేశారు. అలాగే తెలంగాణలో వచ్చిన పెట్టుబడులు, ఆధునిక టెక్నాలజీ గురించి ఇద్దరూ పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు.
https://twitter.com/KTRTRS/status/1611220754871484418?s=20&t=9Y6A7yh90tJE_hmGL6pFnQ