సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెల‌వ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు. జాతీయ పార్టీ ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శించే హ‌క్కు రాహుల్‌కు లేద‌ని మంత్రి ఆరోపించారు.ప్ర‌ధాన‌మంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా ప్ర‌జ‌ల్ని ఒప్పించి స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా గెల‌వాల‌ని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. 2019లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

 

 

టీఆర్ఎస్ కూడా తాము జాతీయ స్థాయి నేతలని, అంతర్జాతీయ స్థాయి నేతలని అనుకుంటారని, అంతర్జాతీయ స్థాయి పార్టీ కూడా పెట్టుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా చైనాలో కూడా పోటీ చేయవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అమెరికా, చైనాలో కూడా పోటీ చేసుకోవచ్చని, దాంతో తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు.

 

https://twitter.com/KTRTRS/status/1587307623845548033?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1587307623845548033%7Ctwgr%5E863e518ce3ecf3eafb999e888762ce212d14fb5a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Frahul-gandhi-should-first-convince-his-people-to-elect-him-as-an-mp-tweets-minister-ktr-820924