చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగమే రాళ్ల దాడి : మంత్రి జోగి రమేష్

టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ రాళ్ల దాడి అంశంపై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆయన రాజకీయ కుట్రలో భాగమే ఈ దాడి అని, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా రాళ్లు వేయించుకోవడం చంద్రబాబుకు చాలా సాధారణ వ్యవహరమని విమర్శించారు. మొదట పవన్ మీద రెక్కీ అంటూ హడావుడి చేశారని, ఇప్పుడు రాయి వేసినట్లు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రాయి ఎవరితో వేయించుకున్నారో తేలుస్తామని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర అంతా ఇలాంటి కుట్రల చరిత్రే అని మండిపడ్డారు.

Related Posts

Latest News Updates